- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది: ఏలేటి
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని, లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా బీజేపీ ఎంపీలు గెలవడంతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని, లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా బీజేపీ ఎంపీలు గెలవడంతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్రాప్రియేషన్ బిల్లుపై సభలో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చ సందర్భంగా కావాలనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా నడిపాయని ఫైరయ్యారు. అధికార పార్టీ స్కెచ్‌తోనే బుధవారం సభలో బీఆర్ఎస్ చర్చను పక్కదారి పట్టించారని ఏలేటి ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ సభను నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






