బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

by Disha Web Desk 1 |
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. నాలుగు బ్యాంకులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 అకౌంట్లు సీజ్ చేయడం దారుణమన్నారు. రూ.210 కోట్ల డోనేషన్‌లో రూ.14 లక్షల క్యాష్​ లావాదేవీలు జరిగాయని చిన్న కారణంతో అకౌంట్స్ సీజ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. పొలిటికల్ పార్టీలు ఇప్పటి వరకు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టిన చరిత్ర లేదని తెలిపారు. 50 శాతం ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీ ఖాతాలకే మళ్లాయన్నారు.వాటి మీద నిఘా ఉండదన్నారు.

కానీ ఇతర పార్టీల బాండ్స్ పై ఎందుకు అంత ఫోకస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీజ్ చేసిన ఖాతాలో ఉన్న డబ్బులు వాడుకోకుండా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలాంటి విధానాలను పాటిస్తుందన్నారు. దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇన్ కమ్ టాక్స్ కట్టిన దఖాలాలు లేవన్నారు. ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈసీ, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా, తీరు మారలేదన్నారు. మేఘా కంపెనీ రూ.170 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిందన్నారు.

తొమ్మిదిన్నర ఏండ్లలో బీజేపీ డోనేషన్స్ 10 రెట్లు పెరిగాయన్నారు. మతం, దేవుళ్లు, అక్షింతల పేరిట మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోల్,గ్యాస్ ధరలను పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చిందన్నారు. పేదలకు అన్యాయం చేసి బీజేపీ కి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అధికార ప్రతినిధులు జ్ఞాన సుందర్,నిజాముద్దీన్, లింగం యాదవ్, గజ్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed