Bird Flu Virus: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాష్ట్రంలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

by Kema Shiva Kumar |

ఏపీ (Andhra Pradesh)లో బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus) అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Bird Flu Virus: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాష్ట్రంలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ (Andhra Pradesh)లో బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus) అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కానూరు (Kanur)లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల వరుస హెచ్చరికలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. తెలంగాణలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిందనే ప్రచారం సోషల్ మీడియా (Social Media)లో ఊపందుకోవడంతో జనం చికెన్‌ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కస్టమర్లతో కళకళలాడిన చికెన్ సెంటర్లు (Chicken Centers) నేడు వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.210-230 ఉండగా.. ఇవాళ ధర ఇప్పుడు కేజీ రూ.150-170 పలుకుతోంది. అంత పెద్ద మొత్తంలో ధర తగ్గినా.. తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫ్టెక్ట్ లేనప్పటికీ ఎవరూ చికెన్‌ కొనుగోలో చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక, నాన్‌వెజ్ ప్రియులు చికెన్ తినడం మానేసి ప్రత్యామ్నాయంగా మటన్, చేపలను ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కాగా, ఏపీ (Andhra Pradesh)లో కొళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ (Bird Flu Virus) సోకడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అప్రమత్తమైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను అనుమతించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దుల్లో 24 చెక్‌‌పోస్ట్‌ (Check Post)లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను తిరిగి వెనక్కి పంపుతున్నారు. బర్డ్‌ఫ్లూ‌పై పౌల్ట్రీ రైతులకు (Poultry Farmers) అవగాహన కల్పించాలని పశు సంవర్ధక శాఖ (Department of Animal Husbandry) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Next Story