పేద, మధ్య తరగతికి పెద్ద ఊరట.. కొత్త బీమా పథకం: 1.15 కోటి కుటుంబాలకు లాభం

by Ramesh Naini |

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు.. రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు చేయబోతున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.

పేద, మధ్య తరగతికి పెద్ద ఊరట.. కొత్త బీమా పథకం: 1.15 కోటి కుటుంబాలకు లాభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు.. రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు చేయబోతున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమల్లోకి వస్తుందని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కోసం రూ. 4వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇది వరం అని.. తెలంగాణలో పుట్టటం.. జీవించటం అనేది వరం అనే విధంగా ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా.. ప్రభుత్వం భద్రత కల్పించటానే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు.. ఆకస్మికంగా దూరమైతే.. ఆ కుటుంబం వీధిన పడకుండా ఈ బీమా ఆదుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.

ప్రపంచంలో ఇలాంటి పథకాన్ని తీసుకురాలే..

విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తి దూరమైతే ఆ కుటుంబం వేదన అంతా ఇంతా కాదు.. ఇదే సమయంలో ఆర్థిక భారంతో ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమల్లోకి తీసుకువస్తున్నట్లు భట్టి తెలిపారు. ప్రపంచంలోనే ఇలాంటి పథకాన్ని ఏ దేశం.. ఏ ప్రభుత్వం తీసుకురాలేదని.. ఎవరికీ ఇంత వరకు సాధ్యం కాలేదని.. ఇలాంటి మహత్తరమైన జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, మధ్య తరగతి అనే వ్యత్యాసం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. కాగా ఈ పథకం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు కుటుంబ పెద్దకు బీమా వర్తిస్తుందని తెలిపారు. కాగా ఈ పథకం ప్రారంభంతో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రైతు బీమా, చేనేత బీమా వంటి ప్రమాద బీమా పథకాలు రద్దు కానున్నాయి.

Next Story