PAN Aadhaar Linking :పాన్‌తో ఆధార్ లింక్‌పై ఐటీ శాఖ బిగ్ అలర్ట్.. చేయకుంటే నిరుపయోగమే!

by Disha Web Desk 4 |
PAN Aadhaar Linking :పాన్‌తో ఆధార్ లింక్‌పై ఐటీ శాఖ బిగ్ అలర్ట్.. చేయకుంటే నిరుపయోగమే!
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానంపై ఐటీ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. పాన్ తో ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపు దారులను ఐటీ శాఖ కోరింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుందని తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. పాన్ తో ఆధార్ అనుసంధానం చేయడానికి రూ.వెయ్యియ రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగియగా ఆలస్య రుసుముతో అనుసంధానికి ఛాన్స్ ఇవ్వనున్నారు. డెడ్ లైన్ పూర్తయ్యాక పాన్ కార్డు నిరుపయోగంగా మారడంతో పాటు బ్యాంక్ ఖాతాలు, డీ మ్యాట్ అకౌంట్ తెరవడానికి సాధ్యపడదని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు 2023 మార్చ్ 31 గడువుగా నిర్ణయించింది. వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పౌరులను కోరింది.

Next Story

Most Viewed