జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. మరోసారి అక్రిడిటేషన్‌ గడువు పొడిగింపు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. మరోసారి అక్రిడిటేషన్‌ గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీతో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియ‌నుంది. త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ గ‌డువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 31, 2025 వ‌ర‌కు అక్రిడిటేషన్ కార్డుల గ‌డువును పొడిగిస్తూ ఇప్పటికే ఆయా జిల్లాల క‌లెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సంబంధిత శాఖ అధికారులు సమాచారం అందజేశారు.

Next Story