బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 4 |
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతి నెల ప్రారంభానికి ముందు ఆర్బీఐ బ్యాంక్ హాలిడేస్‌ను ప్రకటిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఏప్రిల్​నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇప్పటికే మార్చి నెలలో దాదాపు 12 రోజుల పాటు సెలవు తీసుకున్న బ్యాంకులు.. వ‌చ్చే నెల(ఏప్రిల్)లో కేవలం 15 రోజులే పనిచేయనున్నాయి!. శని, ఆదివారాలతో పాటు లోక‌ల్ హాలిడేస్, సహా 15 రోజుల(అన్ని రాష్ట్రాల్లో కలిపి) పాటు దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1నుంచి (2023-2024) కొత్త ఆర్థిక సంవ‌త్సరం ప్రారంభం కానుంది.​

ఈ నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. అయితే, వచ్చే నెలలో గుడ్ ఫ్రైడే, ఈద్, బాబా అంబేద్కర్ జయంతి, మహావీర్‌ జయంతి, బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి, రంజాన్​ వంటి ప్రత్యేక రోజులు ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమ సంబంధిత బ్యాంకులను సందర్శించాలనుకుంటున్న బ్యాంక్ కస్టమర్‌లు తమ పనిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. కాగా, ఆర్బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి: రైళ్లపై దాడి చేస్తే ఇక అంతే.. కీలక ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ


Next Story

Most Viewed