ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లతో జాగ్రత్త! ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లతో జాగ్రత్త! ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్తగా వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ. అన్ని రంగాలు ఏఐ టెక్నాలజీతో ప్రయోజనాలు పొందుతున్నాయి. అయితే కేటుగాళ్ళు మోసం చేయడానికి ఈ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించడం ఆందోళనకరంగా మారింది. ఇటీవల ఏఐ అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.

ఏఐ టెక్నాలజీతో టార్గెట్ వ్యక్తుల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు లేదా తెలిసిన వారి వాయిస్‌ను మిమిక్రీ లేదా ఇమిటేట్‌ చేస్తున్నారు. దీన్ని ఎవరూ గుర్తుపట్టలేక పోతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లతో జాగ్రత్త! మీ బంధువుల వాయిస్‌ని ఏఐతో ఇమిటేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి మోసాల వలలో చిక్కుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి’ అని సూచించారు.



Next Story

Most Viewed