బీజేపీ, BRS పొత్తుపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బీజేపీ, BRS పొత్తుపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌తో పొత్తు వ్యవహారంపై టీ బీజేపీ నేతలు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు. పొత్తుల టాపిక్‌పై బీజేపీ నేతలు రియాక్ట్ అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ రెస్పాండ్ కాలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ క్రమంలో బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదే పదే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు అంటున్నారు.. అస్సలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పొత్తు గురించి బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్‌లతో ఎవరూ మాట్లాడారని ఎగిరేగిరి పడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, కేసీఆర్ సెక్యులర్ లీడర్ అని సుమన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని.. బీజేపీ వాళ్లే మీడియాకు లీక్‌లు ఇస్తున్నారని.. వాళ్లే పేపర్లలో రాయించుకుంటున్నారని ఆరోపించారు. బయటకు మాత్రం బీఆర్ఎస్‌తో పొత్తు లేదని ఎగిరిపడుతున్నారని విమర్శించారు.



Next Story