ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం..

by Disha Web Desk 13 |
ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల జీవన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం జీవన్ రెడ్డి కి బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు 4+4 సిబ్బందితో భద్రత కల్పించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఘటనతో జీవన్ రెడ్డికి భద్రతను పెంచింది.

సీఎంతో భేటీకి పట్నం దూరం.. పాల్గొన్న ఎమ్మెల్యేలు

Next Story