1PM Dynamic : హీరోయిన్ తమన్నా పని ఇక ‘గోవిందా’ .. ఆ వీడియో రిలీజ్ చేసిన ‘నా అన్వేష్’

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-17 10:37:50  IST  )

పవిత్రమైన వేంకటేశ్వర స్వామి పేరుతో ‘గోవిందా’ అనే బెట్టింగ్ యాప్‌ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు నడుపుతున్నారని ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ ఆరోపించారు.

1PM Dynamic : హీరోయిన్ తమన్నా పని ఇక ‘గోవిందా’ .. ఆ వీడియో రిలీజ్ చేసిన ‘నా అన్వేష్’
X

పవిత్రమైన వేంకటేశ్వర స్వామి పేరుతో ‘గోవిందా’ అనే బెట్టింగ్ యాప్‌ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు నడుపుతున్నారని ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ‘ఎక్స్’ వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడికి, డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. ఇంతకూ తమన్నాపై నా అన్వేష్ ఎందుకు కంప్లైంట్ చేశాడో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

‘మా గ్రామంలో కల్లు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం.. కల్లు దుకాణాలను పునరుద్ధరించాలి..’ అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో జరిగింది. కల్లు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ వింత వింతగా ప్రవర్తిస్తూ నిరసనకు దిగారు. వీల్లు ఎందుకు ఇలా ఆందోళనకు దిగాల్సి వచ్చిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు అకారణంగా పోలీసుల రక్షణ కోరలేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారి జీవితానికి నిజంగానే ముప్పు ఉంటేనే తప్ప భద్రత కల్పించలేమని వెల్లడించింది. పెళ్లిచేసుకున్న జంట ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని సూచించింది. దీనికి సంబంధించిన తీర్పును ఈ లింక్‌లో చూడండి.

ఇటీవల దుబాయ్‌లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏం అన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story