కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ మరో స్కెచ్!

by Disha Web Desk 13 |
కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ మరో స్కెచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపు కోసం పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా యాదగిరిగిగుట్ట పేరు మార్పు ప్రస్తావన తెరమీదకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా నామకరణం చేయగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ యాదాద్రిని యాదగిరి గుట్టగానే కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే యాద్దరి పేరును యాదగిరి గుట్టగా మారుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నిన్న ప్రకటించగా ఆ మరుసటి రోజే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం యాదాద్రి ఇకపై యాదగిరిగుట్టగా పిలవబడుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎంపీ ఎన్నికల వేళ ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకే ఈ విషయంలో అధికర పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సెంటిమెంట్ పాలిటిక్స్ లో కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేలా..:

ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ ఆలయాన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టి అదే సమయంలో నాటి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట స్థానంలో యాదాద్రి పేరును పెట్టారు. అయితే ఈ యాదాద్రి పేరును త్రిదండి చినజీయర్ స్వామి సూచించారనే ప్రచారం కూడా అప్పట్లో వినిపించింది. ఈ పేరును మొదటి నుంచి తెలంగాణ భక్తులు వ్యతిరేకిస్తున్నా వారి సెంటిమెంట్ ను కాదని కేసీఆర్ సర్కార్ మాత్రం మొండిగా యాదాద్రిపేరునే కంటిన్యూ చేసింది. అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో టెంపుల్ పాలిటిక్స్ కీ రోల్ పోషించబోతున్నాయనే చర్చ జరుగుతోంది. బీజేపీ రాముడి సెంటిమెంట్ ను ప్రయోగిస్తే దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ యాదాద్రిని ప్రస్తావిస్తోంది. అయితే అయితే మెజార్టీ భక్తుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఆలయం పేరును యాదాద్రిగా కేసీఆర్ మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి యాదగిరిగుట్టగా మార్చడం ద్వారా కేసీఆర్ కు చెక్ పెట్టేలా అధికార పక్షం నిర్ణయం తీసుకుంటోందా అనే టాక్ వినిపిస్తోంది.

అధికారపక్షం ప్రకటనపై సర్వత్రా హర్షం:

యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్టగా మారుస్తామని అధికార పక్షం చేస్తున్న ప్రకటనపై ఇంటర్నెట్ లో నెటిజన్ల మద్దతు లభిస్తోంది. అధికారికంగా ఇంకా ఎలంటి జీవో విడుదల కాకపోయినా స్వయంగా మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ నోటి నుంచి పేరు మార్పు అంశం ప్రస్తావనకు రావడంతో దాదాపు ఖాయం అనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ నిర్ణయం స్వాగతించాల్సిందే అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ కు ఈ నిర్ణయం నిజంగా షాకిచ్చే అంశమే అని చర్చించుకుంటున్నారు. మరి టెంపుల్ సెంటిమంట్ లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.



Next Story