- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiger Tension : ఇంకా ఆ జిల్లాలోనే పెద్ధపులి!
ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)కు చేరిన పెద్దపులి(Tiger)దాదాపు మూడు నెలలుగా అదే జిల్లా పరిధిలోనే సంచరిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో తాజాగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం(Tension) రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)కు చేరిన పెద్దపులి(Tiger)దాదాపు మూడు నెలలుగా అదే జిల్లా పరిధిలోనే సంచరిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో తాజాగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం(Tension) రేపుతోంది. మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల(Enter In Forests Of Pratapagiri)వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారానికి సంబంధించి పలు చోట్ల పాదముద్రలు (పగ్ మార్క్స్) కనిపించాయి.
దీంతో ప్రతాపగిరి అడవుల చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 18 రోజులుగా కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని అడవుల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించగా పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడవులను జల్లెడ పడుతున్నారు.
అదిలాబాద్ జిల్లా సరిహద్దుల గుండా గోదావరి తీర ప్రాంతం నుంచి పులి ములుగు జిల్లాలో ప్రవేశించి తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మీదుగా సాగుతూ నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తుంది. ములుగు ఎజెన్సీ నుంచి మహాబూబాబాద్, వరంగల్ అడవులలో సంచరిస్తు ముందుకు సాగుతోంది. తరుచు ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తున్న పులి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. పాదముద్రల ఆధారంగా దానిని మగపులిగా గుర్తించారు. పశువుల కాపరులు, రైతులు ఒంటరిగా వెళ్లవద్ధని అధికారులు హెచ్చరిస్తున్నారు.






