- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ వర్సిటీ సిబ్బందికి ఈనెల 4న జీతాల చెల్లింపు
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని జరిగే ప్రచారంలో వాస్తవం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్అల్దాస్జానయ్య ఖండించారు.

X
- కొందరు ప్రముఖుల వేతనాలు ఇవ్వలేదని చెప్పడం సరికాదు : వీసీ అల్దాస్ జానయ్య
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని జరిగే ప్రచారంలో వాస్తవం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్అల్దాస్జానయ్య ఖండించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ యూనివర్శిటీ సిబ్బందికి ఈనెల 4వ తేదీనే జీతాలతోపాటు, పెన్షనర్లకు కూడా పెన్షన్ పూర్తిస్థాయిలో చెల్లించామని తెలిపారు. గత 20 నెలల నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బందికి ప్రతినెల 3వ తేదీ లోపు జీతాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, పెన్షనర్లకు గత పది నెలల నుండి ప్రతినెల 1వ తేదీనే చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్న కొందరు ప్రముఖులు పూర్తిస్థాయి సమాచారం లేకుండా విశ్వవిద్యాలయాల సిబ్బందికి ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినా కూడా జీతాలు చెల్లించ లేదని పేర్కొనడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






