సుదీర్ఘ కాలం తర్వాత వారిపట్ల తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Disha Web Desk 13 |
సుదీర్ఘ కాలం తర్వాత వారిపట్ల తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో:జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా జైళ్లలో సత్ర్పవర్తన కలిగిన 212 మంది జీవిత ఖైదీలు19 మంది జీవితేతర ఖైదీలు మొత్తం 231 మంది ఖైదీలు ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం రాష్ట్ర గవర్నర్ కు ఖైదీలకు క్షమాభిక్ష కల్పించడానికి లేదా శిక్షల నుంచి ఉపశమనం కల్పించేందుకు కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. సాధారణంగా ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), రిపబ్లిక్ డే (జనవరి 6) ఈ మూడు సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, 2020లో రెండు సంవత్సరాలలో మాత్రమే ఖైదీలకు ముందస్తుగా విడుదల చేశారు. ఆ తర్వాత జరగలేదు. దీంతో ఖైదీలను విడుదల చేయాలని కొంత కాలంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, ఖైదీల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఎంపిక చేసింది.



Next Story

Most Viewed