Addnaki Dayakar: నాడు విధ్వంసం చేసి నేడు చిలకపలుకులా?.. బీఆర్ఎస్ పై అద్దంకి ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-07-31 08:13:14  IST  )

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు.

Addnaki Dayakar: నాడు విధ్వంసం చేసి నేడు చిలకపలుకులా?.. బీఆర్ఎస్ పై అద్దంకి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై (MLAs Disqualification Petition) సుప్రీంకోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పుపై స్పందించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ పార్టీ ఫిరాయింపుల విషయంలో సోయి ఉందా అని బీజేపీని (BJP) సుప్రీంకోర్టు ప్రశ్నించమని విన్నవిస్తున్నామన్నారు. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీదని కంచే చేను మేసిన చందంగా బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి మోడీ లాక్కుంటే తెలంగాణలో కేసీఆర్ అదే పని చేశారని ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అన్నారు. సుప్రీంకోర్టు సూచనను తాము స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ (BRS) బీజేపీకి బీ టీమ్ మాత్రమేనని ఆపార్టీకి అస్తిత్వమంటూ లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామన్నారు. స్పీకర్ కు కూడా రాజ్యాంగం, అంబేద్కర్ పై పూర్తిగా అవగాహన ఉందన్నారు.

గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్ సీపీ, సీపీఐ సభ్యులను బీఆర్ఎస్ చేర్చుకుంది.కు ఈ నాలుగు పార్టీలను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇవాళ చిలకపలుకులు పలుకుతోందని ఇందతా తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో నేను తప్ప మిగతా పార్టీలు ఉండొద్దని గతంలో కక్కుర్తి పడ్డ కేసీఆర్ ఇప్పుడ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ దళిత వ్యక్తి సీఎల్పీ లీడర్ అయితే సహించలేకపోయారని దుయ్యబట్టారు. అటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు చరిత్రలో మేము సుద్దపూసలమని చెప్పే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు నష్టం వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తోందని వారు చేసే సమయంలో రాచరికపోడలతో వెళ్తున్నారన్నారు.

Read More: ఎమ్మెల్యే అనర్హత వేటుపై.. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Next Story