పెళ్లి శుభలేఖలో మోడీ, బండి సంజయ్ ఫోటోలు..

by Disha Web Desk 6 |
పెళ్లి శుభలేఖలో మోడీ, బండి సంజయ్ ఫోటోలు..
X

దిశ, భైంసా: సామాన్యంగా పెళ్లి శుభలేఖలో ఇంటిదైవం లేదా ఇష్టదైవం అయినటువంటి దేవుళ్ళ ఫొటోలను ముద్రించడం చూస్తూనే ఉంటాం. కానీ, బైంసా పట్టణంలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ యువకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్ ఫోటోలను ఉంచి తన అభిమానాన్ని వెల్లబుచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలో నివాసo ఉంటున్న గంగా ప్రసాద్ ఈనెల 24న వివాహం.

బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇంటింటా పంచె శుభలేఖలలో మోడీ, బండి సంజయ్ ఫొటోలను వుంచి వీరాభిమానాన్ని వ్యక్తం చేశాడు. శుభలేఖ అందుకున్న పలువురు వాళ్ళ ఫోటోలను చూసి ఔరా..! అంటున్నారు. గతంలో భైంసా పట్టణానికి చెందిన ఎడ్ల మహేష్ మొదట పెళ్లి పత్రికలో మోడీ బొమ్మ నుంచి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు పలువురు యువత సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వడానికి ఉత్సాహాన్ని చూపించే దిశలో ఉన్నారు.



Next Story

Most Viewed