రేపే ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. : జిల్లా ఎన్నికల అధికారి

by Disha Web Desk 23 |
రేపే ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. : జిల్లా ఎన్నికల అధికారి
X

దిశ,ఆదిలాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయం లో ఈనెల 18వ తేది నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 26న నామినేషన్ల స్క్రూటినీ,29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని అన్నారు. జూన్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.

అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో 7 సెగ్మెంట్లలో 1-సిర్పూర్ 5-ఆసిఫాబాద్, 6-ఖానాపూర్, 7- ఆదిలాబాద్, 8-బోత్, 9-నిర్మల్, 10-ముధోల్ ఉన్నాయని తెలిపారు. 7 నియోజక వర్గాలలో 16 లక్షల 44 వేల 715 మంది ఓటర్లు, (పురుషులు: 802575, మహిళలు 842054, ఇతరులు 86) సర్వీస్ ఓటర్లు 2115, (పురుషులు, 2085, మహిళలు 30)ఉన్నారని అన్నారు. ఇందులో ఏడు నియోజకవర్గాల గాను 2111 పోలింగ్ కేంద్రాలు, 88 సహాయక పోలింగ్ కేంద్రాలు మొత్తం 2199 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది 3891 మంది పీవోలకు ఏపీవో, ఓపిఓలు ఉన్నారని తెలిపారు. పోలీసు, ఇతరులు1237. మొత్తం 5270 మంది ఉన్నారని వెల్లడించారు.

మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించి పీవోలకు ఏపీవో, ఓపిఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వివి ప్యాట్లకు మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించామని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఫామ్ 12 అందజేసి వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు, అత్యవసర విధులు నిర్వహించే సిబ్బందికి ఫామ్ 12 డి అందజేసి ఓటు హక్కు వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి టీములు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి నగదు, మద్యం పంపిణీలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో నగదు రూ. 32,480,068లిక్కర్ 2308.4 లీటర్లు, రూ. 7,94,770, గాంజా 7,57,450 సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎం.సీ.సీ, సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎం.సీ.ఎం.సీ కమిటీ, ఇతర కమిటీలు పనిచేస్తున్నాయని, పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణలో పోలింగ్ నిబంధనలు, మాక్ పోల్ నిర్వహించే విధానం, పోలింగ్ రోజు నిర్వర్తించవలసిన విధులపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పిఓలు, ఎపిఓలు, ఓపిఓలు, పోలీస్ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలతో పాటు పాత్రికేయులు మీడియా తమ పూర్తి సహకారం అందించాలని కోరారు.

Next Story