- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడల్ స్కూల్, గ్రంథాలయాన్ని సందర్శించిన ఎంపీ
మందమర్రి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజీవ్‌నగర్‌లో ఉన్న మోడల్ స్కూల్‌ను ఆదివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు.

దిశ, మందమర్రి : మందమర్రి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజీవ్‌నగర్‌లో ఉన్న మోడల్ స్కూల్‌ను ఆదివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, పాఠశాలలో అందుతున్న సదుపాయాల పై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్తులో కల్పించాల్సిన సదుపాయాల పై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఎంపీ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహార విందులో పాల్గొని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య కోసం తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు.
లైబ్రరీలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. డ్రింకింగ్ వాటర్, ఇంటర్నెట్, వాహన పార్కింగ్, విద్యుత్ వంటి సమస్యలు ఉన్నాయని నిరుద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే లైబ్రరీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవని తెలిపారు. లైబ్రరీలో ఇన్ని సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఎంపీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ తన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరని ప్రతిపక్ష నాయకులు అబద్ధపు ప్రచారాలు చేసి శునకానందం పొందుతున్నారని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అలాగే మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.






