సారీ మేడం... మేం మళ్లీ టీఆర్ఎస్‌లోకే వెళ్తున్నాం...?

by Disha Web |
సారీ మేడం... మేం మళ్లీ టీఆర్ఎస్‌లోకే వెళ్తున్నాం...?
X

దిశ, వెబ్ డెస్క్: మే నెలలో టీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ వాళ్లు టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమైనట్లు ఇతర మీడియాలలో కథనాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్... పార్టీని వీడిన నేతలకు మళ్లీ గులాబీ కండువాలు కప్పే ప్రయత్నాలు చేస్తున్నారంట. అందులో భాగంగానే నల్లాలను పిలిచి మాట్లాడినట్లు అందులో పేర్కొంటున్నారు.

కాగా, నల్లా ఓదెలు టీఆర్ఎస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అదేవిధంగా ఆయన భార్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగుతుంది. 2018లో తనకు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనందున నల్లాల పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం విధితమే.

Next Story

Most Viewed