ఓ సీఎం సారు మాకిచ్చిన హామీని మరిచారా..

by Disha Web Desk 20 |
ఓ సీఎం సారు మాకిచ్చిన హామీని మరిచారా..
X

దిశ, మందమర్రి : పోలీసుల శ్రమించినట్టే అహర్నిషలూ హోం గార్డులు కూడా విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే వారికి మాత్రం ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య సంరక్షణ లేదు. చివరికి మృత్యువాత పడితే తల్లిదండ్రులు, పిల్లలు, ఇల్లాలికి పెన్షన్ రాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సూపర్ కాప్ మీటింగ్, భక్త రామదాసు ప్రాజెక్టు శంకుస్థాపన, శాసనసభ సమావేశాలు, టీఆర్ఎస్ భవన్, సీఎం హైటెక్స్ పోలీస్ ఆఫీసర్స్ సమావేశం, ప్రగతి భవన్ తదితరులలో హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చిన ఆ హామీలు ఎండమావులుగానే దర్శనమిస్తున్నాయని హోం గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారు ఒకసారి ఆలోచించండి మీ ఆలోచనను అమలు చేస్తే 15,000 కుటుంబాలు చిగురుస్తాయని 1000 కళ్ళతో హోంగార్డులు, వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 మంది హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు పర్మినెంట్ పోలీస్ కానిస్టేబుల్ విధులకు సరిపడా పోలీస్ కానిస్టేబుల్, సివిల్, పిటిఓ, డ్రైవర్లు, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఎస్ పీఎఫ్ తదితర పనులు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిని హోంగార్డుల నుండి పోలీస్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తామని కేసీఆర్ సర్కార్ హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీ అమలు కావడం లేదు. దీనితో బాధితులు ఆందోళన బాటకు సమాయుక్తమవుతున్నారని సమాచారం.

ఆరోగ్య భద్రత కార్డు ఇప్పించండి..

సీఎం, డీజీపీ సార్లు మాకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత కార్డులు ఇప్పించండని హోంగార్డులు కోరుతున్నారు. వృత్తిలో భాగంగా 2019 నుండి 2022 వరకు 171 మంది హోంగార్డులు మరణించినట్లు పోలీస్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఏదైనా కుటుంబానికి అనారోగ్య సమస్య ఎదురైతే అత్యున్నత వైద్యం కొరకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే ఆర్థిక స్తోమత లేదు. జర మాపై కరుణ చూపిస్తే మా కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారని వేడుకుంటున్నారు.

మెడికల్ 15, సాధారణ 15 రోజుల సెలవులు ఇవ్వాలి

హోంగార్డులకు మెడికల్ 15, సాధారణ 15 రోజులు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు, వారి పిల్లల వివాహాలు, ఆసుపత్రులు, జనన, మరణాలు తదితరుల విషయంలో సెలవులు వర్తించేలా చూడాలని హోంగార్డులు కోరుతున్నారు.

హోంగార్డులను పర్మినెంట్ చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15వేల మంది హోంగార్డులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడ ఎనిమిది సార్లు హోంగార్డులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు హామీలుగానే నిలిచిపోయాయని హోంగార్డులు వాపోతున్నారు. పోలీసుల వలె 24 గంటలు విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.



Next Story