'అందుగులపేట వాగు పైపులైన్ కొట్టుకుపోతే ఎమ్మెల్యేకు సోయిలేదు'

by Disha Web Desk 20 |
అందుగులపేట వాగు పైపులైన్ కొట్టుకుపోతే ఎమ్మెల్యేకు సోయిలేదు
X

దిశ, మందమర్రి : మందమర్రి మండలం అందుగులపేట గ్రామపంచాయతీ వాగు పైపులైన్ వర్షానికి కొట్టుకుపోయి నాలుగు సంవత్సరాలు కావస్తున్న స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ కు సోయి లేదని చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకల రమేష్ విమర్శించారు. మందమర్రి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సె హాత్ జోడో యాత్ర 22 రోజులకు చేరుకుంది. అందులో భాగంగా గడప గడప వెళ్ళుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తనను ప్రజలు ఆదరించాలని వేడుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన ప్రజాయుత కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అందుగుల పేట వాగుఅవతల వందలాది ఎకరాల భూములు ఉన్నాయని అన్నారు. వాగుపై వేసిన వంతెన వరదలకు కూలిపోయి 4 ఏళ్ళు దాటినా టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని పునరుద్ధరించిన పాపాన పోలేదని అన్నారు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లే క్రమంలో పశువులు, మనుషులు వరదలలో కొట్టుకపోయి మృత్యువాత పడ్డ సందర్భాలు అనేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్య ఇలా ఉంటే చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏం చేస్తున్నాడని నిలదీశారు.

గ్రామంలో నిరుద్యోగ సమస్య, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఇలా అయితే రానున్న ఎండాకాలంలో ప్రజలకు నీటిసమస్య ఉంటుందని జోష్యం చెప్పారు. దుక్కి దున్ని పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు డి.సీ.సీ. సభ్యులు జి. రాంచందర్, పుల్లూరి లక్ష్మణ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండీ ముజాహిద్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెర్వేట్ల శ్రీనివాస్, నాయకులు, అనగందుల శ్రీనివాస్, సుగుణకర్ రావు, మరాఠి శంకర్, బానయ్య, ఆకుల అంజి, జమాల్ పూరి నర్సోజి, యువజన నాయకులు వడ్లూరి సునీల్, ఎండీ నయీమ్, మహిళా నాయకులు నూగూరి రాధా, స్వరూప, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed