చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి: సర్పంచ్ ముత్యంరెడ్డి

by Kodari Anjali |

చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి అన్నారు.

చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి: సర్పంచ్ ముత్యంరెడ్డి
X

దిశ, మామడ: చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కమల్ కోట్ గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రవేశం కోసం చిన్నారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ పాఠశాలలో ఎల్ ఏ జి, యూకేజీ తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని ప్రధానోపాధ్యాయులు మన్మద్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో ఈ పాఠశాల ప్రారంభించడం చాలా సంతోషకరమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story