అకాల వర్షం... అపార నష్టం..

by Disha Web Desk 20 |
అకాల వర్షం... అపార నష్టం..
X

దిశ, భీమిని : అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్రనష్టం వాటిల్లింది గత మూడు రోజులుగా మేఘాలు మబ్బులు కమ్ముకుపోయి వడగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి పూత పిందె రాలిపోతుంది. జనవరి నెల నుండి మామిళ్లు పూతకు వచ్చి కింద దశ నుండి రెండు నెలల కాలంలోనే చెట్లకు కాయలు కాసాయి. దీంతో రైతుల మోకాల్లో ఆనందం వెళ్లి విరిసింది మామిడి తోటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఒక్కసారిగా వడగళ్ల వర్షం కన్నీళ్లను మిగిల్చింది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మామిడి తోటలు చాలా ప్రసిద్ధి ఇక్కడ ప్రతి ఏటా హైదరాబాద్, మహారాష్ట్ర, నాగపూర్ రాష్ట్రాలకు మామిడికాయలను ఎగుమతి చేసి అమ్ముకుంటారు. గతేడాది కంటే ఈసారి మామిడి తోటల్లో ఎక్కువ శాతం ఖాత దశలో ఉన్న తోటలకు మంచి ఆదాయం సమకూరుతుందని చూసిన రైతులకు ఒక్కసారిగా వడగండ్ల వర్షం నిరాశ కలిగించింది.

వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు..

నెన్నెల మండలంలోని ఆవడం, చిత్తాపూర్, నెన్నెల, మైలారం, గొల్లపల్లి, గ్రామాల చుట్టూ సుమారు 6వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇక్కడి మామిడి తోటలు ఎంతగానో పేరుగాంచాయి. సీజన్ రాకముందే మామిడి తోటలకు రైతులు అధిక పెట్టుబడులు పెట్టి తోటల్లో సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటలకు నీళ్లను పారించి పడిగాపులు కాస్తుంటారు. ఈ ఏట జనవరి నెల నుండి పూత పింద దశకు రాగానే మామిడి తోటలకు గిరాకీ పెరుగుతుందనీ చూసిన రైతులకు అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ఇక్కడ పండేమామిడి పండ్ల రకాలు..

ఈ జిల్లాలో అధికంగా బంగినపల్లి, తోతాపరి, పచ్చడి కాయలు, దాసేరి, నూజివీడు రసాలు, అధికంగా ఉన్నాయి.

ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి..

అకాల వర్షాలతో మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి రైతులు గోడును వెల్లబోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామిడితోట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పనుల తోటల సాగును పెంచాలని రైతులను ప్రోత్సహిస్తున్న మామిడి తోటల రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ఈ సారైనా వడగండ్ల వర్షాలతో నష్టపోయిన మామిడి తోట రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

Next Story

Most Viewed