అరెస్టులతో బీఆర్​ఎస్​ శ్రేణులను ఆపలేరు

by Sridhar Babu |

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులతో ఆపలేరని, త్వరలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.

అరెస్టులతో బీఆర్​ఎస్​ శ్రేణులను ఆపలేరు
X

దిశ, ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులతో ఆపలేరని, త్వరలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడికి నిరసనగా శుక్రవారం పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో స్థానికంగా ముందస్తు హౌజ్ అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు శాంతినగర్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో పాటు వన్ టౌన్, టూ టౌన్,పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆయా వార్డుల్లోని కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Next Story