గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి చేసిన పనికి అంతా షాక్..!

by Disha Web Desk 19 |
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి చేసిన పనికి అంతా షాక్..!
X

దిశ, క్యాతన్ పల్లి: ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకుని.. మరో యువతితో పెళ్లికి రెడీ అయిన ప్రియుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. రామకృష్ణాపుర్ పట్టణానికి చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడు గత ఆరేళ్లుగా తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడని యువతీ పోలీసుల ఎదుట వాపోయింది. రాజేష్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని.. అతడి బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం పెళ్లి జరిగే ఫంక్షన్ హల్‌కు చేరుకుని ప్రియుడి చొక్కా పట్టుకుని నిలదీసింది. దీంతో అతడి పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. రాజేష్ తనను మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని.. వివాహం చేసుకోకుండా అబార్షన్ చేయించాడని ఆ యువతి ఆరోపించింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు రామకృష్ణాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Next Story

Most Viewed