రెండున్నరేళ్ల బాలుడి కిడ్నీలో రాళ్లు..

by Disha Web Desk 20 |
రెండున్నరేళ్ల బాలుడి కిడ్నీలో రాళ్లు..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మారుతున్న పరిస్థితులు మనిషి పై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. కేవలం రెండున్నరేళ్ల బాబు కిడ్నీలో రాళ్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఇది అరుదైన ఘటనగా చెప్పవచ్చు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆ రాళ్లను బయటకు తీశారు. ఆ బాలుడికి బాధను తప్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆసుపత్రి వైద్యుడు శశికాంత్ వెల్లడించారు. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన రెండున్నర ఏళ్ల బాబు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

పలుచోట్ల చూపించగా విషయం బయటపడలేదు. చివరకు నిర్మల్ జిల్లాకేంద్రంలోని స్వప్న ఆసుపత్రిలో యూరాలజిస్ట్ వైద్యుడు శ్రావణ్ వద్ద చూపించారు. చిన్న బాబు కావడంతో సిటీ స్కాన్ చేసి విషయాన్ని తేల్చారు. ఆ బాబు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా మొదట్లో వాళ్ళు నమ్మలేదు. సిటీ స్కాన్ రిపోర్టులను వివరించగా, వారు ఆపరేషన్ కు ఒప్పుకున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో చేసే ఈ అరుదైన శస్త్ర చికిత్సను నిర్మల్ జిల్లాకేంద్రంలోని స్వప్న ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యుడు శశికాంత్ వివరించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed