ఊరూరా చెరువుల పండుగ నిర్వహించాలి

by Disha Web Desk 15 |
ఊరూరా చెరువుల పండుగ నిర్వహించాలి
X

దిశ, తాండూర్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేదీన ఊరూర చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలని కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఆర్డిఓ రాజేశ్వర్ తో కలిసి చెరువుల పండుగ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల పండుగ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్టల వద్దకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో రావాలన్నారు. చెరువు కట్టలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆటలు, పాటలతో కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి హాజరైన వారందరికీ భోజన వసతి కల్పించాలని కోరారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed