- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామీణ ప్రాంత మహిళా పారిశ్రామిక వేత్తల విజయాలు స్పూర్తిదాయకం : జయేష్ రంజన్
తెలంగాణ గ్రామీణ ప్రాంత మహిళా పారిశ్రామిక వేత్తల విజయగాధలు స్పూర్తి దాయకమని ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంత మహిళా పారిశ్రామిక వేత్తల విజయగాధలు స్పూర్తి దాయకమని ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. గురువారం వీహబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు నెలల వీ-రీచ్ ప్రీ ఇంకుబేషన్ శిక్షణా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళా పారిశ్రామికవేత్తలందరినీ అభినందించారు. గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం వ్యాపారానికి అనుకూలమైన వనరులను స్రుష్టించడంలో వీహబ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు సరైన సాధనాలు, అవకాశాలను అందిస్తూ వి-రీచ్ కార్యక్రమం విజయవంతం కావడానికి వీహబ్ నిబద్ధతతో పనిచేసిందన్నారు.
వి-రీచ్:
మహిళా సాధికారతే లక్ష్యంగా నిర్వహించిన మూడు నెలల వి-రీచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం తెలంగాణలోని టైర్2, టైర్3 ప్రాంతాల మహిళా పారిశ్రామిక వేత్తలు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడంతో ముగిసింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, పారిశ్రామిక వేత్తలుగా రాణించడంలో ఈ శిక్షణ ఒక మైలురాయిగా నిలువనుంది..ముఖ్యంగా డిజిటల్ లిటరసీ అనేది ప్రతి మహిళా పారిశ్రామికవేత్తకు అవసరమైంది. సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎస్ఐఈ), ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రోగ్రామ్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్వదేశీ క్రాఫ్ట్స్, సోషల్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా కీలక రంగాలపై వీ-రీచ్ దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ, మార్కెట్, మెరుగైన వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత నైపుణ్యాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. దాదాపు 70 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోగ్రామ్ కంప్లీషన్ సర్టిఫికేట్‌లను అందించారు. శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్ పొందిన మహిళా పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగం కానున్నారు.






