గోత్రం ఏం చదివించారు బ్రో!.. ఫైనల్ లో ఎస్ఆర్‌హెచ్ టీం గెలవాలని అభిషేకాలు

by Ramesh Goud |
గోత్రం ఏం చదివించారు బ్రో!.. ఫైనల్ లో ఎస్ఆర్‌హెచ్ టీం గెలవాలని అభిషేకాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ లో నిన్న జరిగిన క్వాలిఫైయర్ -2 లో రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఫైనల్ వెళ్లిన కోలకత్తాతో ఆదివారం హైదరాబాద్ తలపడనుంది. టైటిల్ పోరులో ఫైనల్ కు వెళ్లడం ఇది మూడోసారి. దీంతో రేపటి మ్యాచ్ ఎలాగైన గెలవాలని ఓ వైపు ఎస్ఆర్‌హెచ్ టీం తీవ్ర కసరత్తులు చేస్తోండగా మరో వైపు అభిమానులు మ్యాచ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే ఎస్ఆర్‌హెచ్ గెలుపు కోసం తెలంగాణలో కొందరు అభిమానులు రామునికి అభిషేకాలు చేయడం ఆసక్తిగా మారింది.

దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో కొందరు అభిమానులు ఎస్ఆర్‌హెచ్ టీం తో పాటు, ఆటగాళ్ల పేర్లపై కూడా శ్రీరాముని గుళ్లో అభిషేకాలు నిర్వహించారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఎస్ఆర్‌హెచ్ టీంతో పాటు ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ అభిమానుల భక్తిని మెచ్చుకుంటూ.. కొందరు నెట్టింట కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు బిన్నంగా స్పందిస్తున్నారు. ముందు సప్లీలు క్లియర్ చెయ్యండిరా అని ఓ నెటిజన్ అనగా.. హర్షిత్ రాణాకి పగిలిపోవాలని మొక్కండి అని, ఇంతకీ గోత్రం ఏం చదివించారు బ్రో అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed