కాంగ్రెస్ గూటికి మహిళా నేత.. ఆ ఎంపీ టికెట్ కోసమేనా?

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ గూటికి మహిళా నేత.. ఆ ఎంపీ టికెట్ కోసమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో నేతల వరసలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. త్వరలోనే పెద్ద ఎత్తున పార్టీల మధ్య నేతల జంపింగులు మొదలు కాబోతున్నాయనే చర్చ జరుగుతున్న వేళ ఇవాళ అధికార కాంగ్రెస్ లో డా.విద్యా స్రవంతి చేరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ చార్జి దీపదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతోందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే వారు కాంగ్రెస్ లో చేరాలన్నారు. పార్టీలో చేరిన వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు.




లోక్ సభ బరిలో?:
సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ వ్యవస్థాపకురాలిగా ఉన్న విద్యాస్రవవంతి గతంలో తెలంగాణ ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కోఆపరేషన్ నామినేటెట్ మెంబర్ గా వ్యవహరించారు. అలాగే మైనార్టీ కమిషన్ సభ్యురాలిగా కూడా కొనసాగారు. విద్యా రంగంతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో చూరుకుగా ఉంటున్న స్రవంతి క్రిస్టియన్ మైనార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఆలోచనతో ఉన్నారా? బరిలో నిలిస్తే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ సమాజిక వర్గానికి చెందిన స్రవంతి పార్టీలో చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది.



Next Story

Most Viewed