Asaduddin Owaisi యూటర్న్.. బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు..!

by Disha Web Desk 4 |
Asaduddin Owaisi యూటర్న్.. బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న ఆయన తాజాగా స్వరం మార్చారు. తాను అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే యూపీఏకు దూరమయ్యామని పేర్కొన్నారు. మోడీకి వ్యతిరేకంగా సిద్ధమవుతున్న కూటమికి తనకు ఆహ్వానం అందలేదని.. కచ్చితంగా మోడీని గద్దె దించేవాళ్లకు తన మద్దతు ఉంటుందన్నారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో అసదుద్దీన్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ను ఓడించటమే మా లక్ష్యమన్నారు. బోదన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందని, రానున్న ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

బోదన్‌లో ఎంఐఎం నాయకులపై కేసులు పెట్టడం అమానుషమని, పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు, అరెస్ట్ అయిన తమ నాయకులు రాత్రింబవళ్లు పని చేశారని, అయినా తమ వాళ్లను అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లింలకు కూడా బంధు ఇవ్వాలన్నారు. గతంలో ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకపోయిన స్పందిచలేదని అన్నారు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారని, ఆ మసీదులు వెంటనే కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న అసద్ వ్యాఖ్యల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో బీఆర్ఎస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల బీఆర్ఎస్, ఎంఐఎం ఓ అండర్ స్టాండింగ్ తో ఉన్నాయి. 2014, 18 ఎన్నికల్లో కలిసే పనిచేశాయి. కానీ తాజా పరిణామాలతో అసద్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే పరిస్థితి ఏమిటన్న వాదన తెరమీదకు వస్తోంది. మోడీ వ్యతిరేక కూటమికి మద్దతిచ్చేందుకు రెడీ అంటూ ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

Also Read..

మూడోసారి ప్రధానిగా మోదీ కావొద్దని కోరుకుంటాం : MIM chief, MP Asaduddin Owaisi



Next Story