మోడీ సభకు 3 లక్షల మంది.. కేసీఆర్​ సభను తలదన్నేలా భారీ సమీకరణ

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-28 16:01:01  IST  )

ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభానికి మే 10న తెలంగాణకు రానున్నారు. అందుకోసం తెలంగాణ బీజేపీ సీనియర్లు ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మోడీ సభకు 3 లక్షల మంది.. కేసీఆర్​ సభను తలదన్నేలా భారీ సమీకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభానికి మే 10న తెలంగాణకు రానున్నారు. అందుకోసం తెలంగాణ బీజేపీ సీనియర్లు ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్​మైదానంలో బహిరంగ సభకు జన సమీకరణ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం పార్టీ కార్యాలయంలో జరిపారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నేతలు హాజరైయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణకు ప్లాన్ ఏవిధంగా చేయాలనే అంశాలను సుదీర్ఘ చర్చించారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో 25 వేలకు జనం తగ్గకుండా తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్​సభలు తలదన్నేలా భారీ సమీకరణ, కొత్త అభివృద్ది పథకాలు ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చని నేతలు అభిప్రాయ పడ్డారు. ఈసభ భారీ ఎత్తున నిర్వహిస్తే త్వరలో జరిగే గ్రేటర్​ఎన్నికలతోపాటు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది.

Next Story