తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రోగులకు ఫ్రీ చికిత్స

by  |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రోగులకు ఫ్రీ చికిత్స
X

దిశ , తెలంగాణ బ్యూరో : కిడ్నీ సంబంధిత వ్యాధులతో, హైపటైటిస్, ఎయిడ్స్ వ్యాధులతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ సేవలను ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్‌లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో పైన తెలిపిన వ్యాధిగ్రస్తులను గుర్తించి ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, హైదరాబాద్, వరంగల్‌లో కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ప్రస్తుతం 43 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని వీటి ద్వారా 10వేల మంది రోగులకు సేవలు అందిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.



Next Story

Most Viewed