WhatsAppలో అదిరిపోయే “స్క్రీన్-షేరింగ్” ఫీచర్

by Disha Web Desk 17 |
WhatsAppలో అదిరిపోయే “స్క్రీన్-షేరింగ్” ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజు రోజుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇటీవల మళ్లీ కొత్తగా “స్క్రీన్-షేరింగ్” అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో తమ స్క్రీన్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.11.19 బీటాను ఇన్ స్టాల్ చేసుకున్న ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది.



WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ పాత వెర్షన్‌లలో అందుబాటులో ఉండదు. కొత్త వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూజర్లు వాట్సాప్ నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కంట్రోల్ ఆప్షన్స్‌లో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ పై ఉన్న కంటెంట్ మొత్తం రికార్డు అవ్వడంతో పాటు వీడియో కాల్ చేసిన వారికి షేర్ంగ్ కూడా అవుతుందని కంపెనీ తెలిపింది.



ఈ ఫీచర్‌లో యూజర్లకు స్క్రీన్-షేరింగ్‌పై పూర్తి స్థాయిలో కంట్రోల్ లభిస్తుంది. స్క్రీన్ షేరింగ్ ఎప్పుడు ప్రారంభించాలో, ఆపివేయాలో నిర్ణయించే అవకాశం యూజర్‌కు మాత్రమే ఉంటుంది. స్క్రీన్ షేర్ చేసిన టైం లో స్క్రీన్ పైన ఉన్న కంటెంట్ రికార్డు అవుతున్నప్పటికీ, యూజర్స్ వారికి కావాల్సినప్పుడు దానిని ఆపవచ్చు అని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో గ్రూప్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ ఫీచర్ పనిచేయకపోవచ్చని సమాచారం.



Next Story

Most Viewed