Instagram and Facebook కు పోటీగా టెలిగ్రామ్‌లో స్టోరీస్ ఫీచర్‌.. ఎప్పటి నుంచంటే!

by Disha Web Desk 17 |
Instagram and Facebook కు పోటీగా టెలిగ్రామ్‌లో స్టోరీస్ ఫీచర్‌.. ఎప్పటి నుంచంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజాలు పోటీ పడి మరి యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తున్నాయి. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కూడా కొత్తగా ఒక ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్నటువంటి స్టోరీస్ ఫీచర్‌ను టెలిగ్రామ్‌లో అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు.

ఇప్పటి వరకు టెలిగ్రామ్ ద్వారా ఇతరులకు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు. డ్యాక్యుమెంట్‌లను షేర్ చేయవచ్చు, అయితే స్టోరీస్ ఫీచర్‌ మాత్రం లేదు. ఈ ఆప్షన్ కూడా ఇవ్వాలని యూజర్ల నుంచి రిక్వెస్ట్‌లుగా రాగా, తాజాగా ఈ ఫీచర్‌ను టెలిగ్రామ్‌లో ఇవ్వనున్నట్లు టెలిగ్రామ్ సీఈఓ అన్నారు. దీనిని జులై నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త ఫీచర్‌ ద్వారా టెలిగ్రామ్ యాప్‌లో స్టోరీస్‌ను ఎవరెవరు చూడాలి అనే ఆప్షన్‌ను అందిస్తున్నారు. దీనికోసం సెట్టింగ్‌లో 'everyone, selected contacts, only contacts' అనే ఆప్షన్లలో యూజర్లు కావాల్సిన వాటిని ఎంచుకోవాలి. చాట్ లిస్ట్ పై భాగంలో స్టోరీస్‌ను ఇస్తున్నారు. ఎవరైన కొత్తగా స్టోరీస్‌ను యాడ్ చేసినట్లయితే అవి చాట్ లిస్ట్ పైన కనిపిస్తాయి. పోస్ట్ చేసిన స్టోరీస్‌లో ఏమైనా మార్పులు ఉంటే అక్కడ టూల్స్ కూడా ఇచ్చారు, వాటి సహాయంతో మార్పులు చేసుకోవచ్చు.



స్టోరీస్‌లు ఎంతసేపు కనిపించాలనే ఆప్షన్ కూడా ఇచ్చారు. 6, 12, 24, 48 గంటల వరకు టైమ్ సెట్టింగ్‌ను అందించారు. కావాల్సిన టైమ్‌ను సెట్ చేస్తే ఆ సమయం పూర్తయిన తరవాత స్టోరీస్ కనిపించవు. దీనిలో పర్మినెంట్ డిస్‌ప్లే ఆప్షన్ కూడా ఇచ్చారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఫొటో, వీడియోలను ప్రొఫైల్‌లో కనిపించేలా పర్మినెంట్‌గా సెట్ చేసుకోవచ్చు.

Read More..

WhatsApp నుంచి మరో కీలక అప్‌డేట్


Next Story

Most Viewed