ఇండియా నుంచి తప్పుకున్న మరో వీపీఎన్ సంస్థ.. ఆ ఆలోచన కూడా లేదు..

by Dishafeatures2 |
ఇండియా నుంచి తప్పుకున్న మరో వీపీఎన్ సంస్థ.. ఆ ఆలోచన కూడా లేదు..
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు వీపీఎన్ సంస్థలకు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రతి వీపీఎన్ సంస్థ తమ వినియోగదారులకు సంబంధించిన 5 సంవత్సరాల డాటాను కనీసం స్టోర్ చేయాలని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే పలు వీపీఎన్ సంస్థలు మన దేశ మార్కెట్ నుంచి తప్పుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రోటోన్ వీపీఎన్ కూడా చేరింది. భారత మార్కెట్ నుంచి తాము తమ సర్వర్లను తొలగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. యూజర్ల డాటాను స్టోరేజ్ చేయాలన్న ప్రభుత్వ నిబంధనపై స్పందిస్తూ ప్రోటోన్ సంస్థ ఈ ప్రకటన చేసింది. 'ప్రభుత్వ నిబంధనకు మద్దతు తెలిపే ఆలోచన కూడా తమ సంస్థకు లేదని, దాంతో పాటుగా ఎటువంటి మాస్ సర్వైలెన్స్ చట్టానికి తాము అనుగుణంగా మసులుకోలేము' అని ప్రోటోన్ సీఈఓ యాండీ యెన్ అన్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి రానుంది.


Next Story

Most Viewed