OnePlus నుంచి మొట్టమొదటి అత్యాధునిక మెకానికల్ కీబోర్డ్‌ లాంచ్

by Disha Web Desk 17 |
OnePlus నుంచి మొట్టమొదటి అత్యాధునిక మెకానికల్ కీబోర్డ్‌ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ ఇటీవల వరుసగా కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారులకు అనువైన కీబోర్డును కంపెనీ ఆవిష్కరించింది. దీని పేరు 'OnePlus కీబోర్డ్ 81 ప్రో'. కీబోర్డ్‌లకు ప్రసిద్ధి చెందిన కీక్రోన్‌తో కలిసి దీనిని తయారు చేశారు. కీబోర్డ్‌లకు ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మెకానికల్ కీబోర్డ్ బ్రాండ్‌లలో Keychron ఒకటి. ఈ కీబోర్డును ప్రత్యేకంగా CNC- అల్యూమినియం నిర్మాణంతో తయారు చేశారు. వినియోగదారుల వేళ్లకు ఎలాంటి నొప్పి లేకుండా సులువుగా అతి తక్కువ సౌండ్‌తో టైపింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని OnePlus కంపెనీ పేర్కొంది.


ఇది రెండు రకాల కనెక్టివిటీని కలిగి ఉంది. USB టైప్-C ద్వారా వెర్డ్ కనెక్షన్, బ్లూటూత్ 5.1 ద్వారా వైర్‌లెస్ కనెక్టవిటీని కలిగి ఉంది. దీనిలో ప్రత్యేకంగా అమర్చిన స్విచ్ ద్వారా Mac, Windows మోడ్‌లకు రెండింటికి సులభంగా కనెక్ట్ అవుతుంది.


వినియోగదారులకు చార్జింగ్ సమస్య నుంచి ఇబ్బందులను తొలగించడానికి 4,000mAh అంతర్గత బ్యాటరీ అమర్చారు. ఇది ఒక్కచార్జ్‌పై గరిష్టంగా 100 గంటల వరకు పనిచేస్తుంది. ఏప్రిల్ 2023 నుండి ఈ కీబోర్డ్ అమ్మకానికి ఉంటుందని OnePlus పేర్కొంది.






Next Story

Most Viewed