రూ.6 వేలకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల

by Disha Web Desk 17 |
రూ.6 వేలకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
X

దిశ, టెక్నాలజీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా ఇండియాలో బడ్జెట్ ధరలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Yuva 3’. ఇది గతంలో వచ్చిన Lava Yuva 2 మోడల్‌కు కొనసాగింపుగా వస్తుంది. Yuva 3 ఫిబ్రవరి 12 నుంచి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు ఉంటుంది. అలాగే ముందస్తుగా అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 7 నుంచి అమ్మకానికి లభిస్తుంది. ఇది కాస్మిక్ లావెండర్, ఎక్లిప్స్ బ్లాక్, గెలాక్సీ వైట్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ.6,799. 4GB RAM+ 128GB వేరియంట్ ధర రూ. 7,299. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉంటాయి.


Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రన్ అవుతుంది. దీనికి రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌‌లను కంపెనీ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. కెమెరాల కోసం బ్యాక్ సైడ్ 13-మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరా, ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీనిలో 18W చార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందించారు. ఫోన్ లాక్/అన్‌లాక్ చేయడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Next Story

Most Viewed