ఎయిర్ ట్రాఫిక్ రాడార్ సిస్టమ్.. ఆకాశంలో ట్రాఫిక్‌ను ఎలా తెలియజేస్తుంది..

by Disha Web Desk 20 |
ఎయిర్ ట్రాఫిక్ రాడార్ సిస్టమ్.. ఆకాశంలో ట్రాఫిక్‌ను ఎలా తెలియజేస్తుంది..
X

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి అనే వార్తలను మనం వింటూనే ఉంటాం. వాతావరణం అనుకూలించని సమయంలో విమానాలను ఆలస్యంగా నడిపిస్తూ ఉంటారు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ లోపభూయిష్టంగా పనిచేయడం ద్వారా విమానాలు ఆలస్యంగా నడిపిస్తారు. అయితే ఇదేం మొదటిసారి కాదు.

ఈ మేరకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ గిల్డ్‌ గత ఏడాది ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇంతకీ ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ అంటే ఏమిటి, అది ఎంత ముఖ్యమైనది, ఇది విమాన ట్రాఫిక్ గురించి సమాచారాన్ని ఎలా అందిస్తుంది ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది ?

ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ అనేక వ్యవస్థలను కలిగి ఉంటుంది. స్కై ట్రాఫిక్‌ పై నిఘా ఉంచడం, సురక్షితంగా ల్యాండింగ్ కోసం సమాచారాన్ని అందించడం వారి పని. దాని సిస్టమ్‌లో కనిపించే మ్యాప్ విమానం దాని వేగం, భూమి నుంచి ఎత్తు, ఇతర సమాచారాన్ని చూపిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ రాడార్ ఆధారంగా పనిచేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ నుంచి అందుకున్న ప్రతి సమాచారం విమానం మెరుగైన ఆపరేషన్ కోసం ఉపయోగపడుతుంది.

దీని అతి ముఖ్యమైన భాగం ఎయిర్ రాడార్. ఇది విమానం ముక్కు ముందు భాగంలో అమర్చి ఉంటుంది. దాని పై ప్రత్యేక రకమైన పెయింట్ పొర ఉంటుంది. ఈ భాగం రాడార్ తరంగాలను విడుదల చేస్తుంది. దాని నుండి అందుకున్న సమాచారాన్ని పైలట్‌కు ప్రసారం చేస్తుంది. అదేవిధంగా అనేక రాడార్లు ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్‌లో భాగం. విమానాశ్రయం టవర్లలో అనేక ముఖ్యమైన సమాచారాన్ని అందించే రాడార్లు ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ రాడార్ ఆటోమేషన్ సిస్టమ్ నాలుగు రకాల రాడార్‌లతో రూపొందించారు.

ఆటోమేషన్ వ్యవస్థ నాలుగు వ్యవస్థలతో రూపొందించారు..

ఎన్-రూట్ రాడార్ సిస్టమ్ : ఈ రాడార్ పని విమానం స్థానం, వేగం, లక్ష్యాన్ని గుర్తించడం. ఈ విధంగా ఇది విమానం గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఒక విధంగా ఇవి ప్రాథమిక నిఘా రాడార్లు. ఇది విమానానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఎయిర్ సర్వైలెన్స్ రాడార్ : ఈ రాడార్ టెర్మినల్ ప్రాంతంలో విమానం స్థానాన్ని తెలియజేస్తుంది. ఇది 25,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. రాడార్‌లో అమర్చిన యాంటెన్నా కారణంగా, సమాచారం చాలా వేగంగా షేర్ చేస్తారు. ఈ సమాచారం ప్రతి 5 సెకన్లకు నవీకరిస్తారు.

ప్రెసిషన్ అప్రోచ్ రాడార్ (PAR) : ఈ రాడార్ అత్యంత చెత్త వాతావరణంలో విమానాన్ని ఎలా ల్యాండ్ చేయవచ్చో తెలియజేస్తుంది. ఈ రాడార్ సహాయంతో పైలట్‌కు సూచనలు పంపిస్తారు. రాడార్ ఆపరేటర్ ఈ సమాచారాన్ని సేకరించి పైలట్‌కు అందజేస్తారు. చాలా సార్లు ఈ సమాచారం విమానంలోని వాయిస్ రేడియో లేదా కంప్యూటర్ లింక్ ద్వారా పంపిస్తారు.

సర్ఫేస్ మూవ్‌మెంట్ రాడార్ (SMR) : ఈ రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్, గ్రౌండ్ వెహికల్స్ స్థానాన్ని గుర్తించేందుకు విమానాశ్రయ ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. చెడు వాతావరణం గురించిన సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లకు ప్రసారం చేస్తుంది. దీని పరిధి కొన్ని కిలోమీటర్లకే పరిమితమైంది.

Next Story

Most Viewed