మనిషి బాడీ హీట్‌తో మొబైల్ ఫోన్స్, లాప్ టాప్‌లకు ఛార్జింగ్..!

by Disha Web Desk 7 |
మనిషి బాడీ హీట్‌తో మొబైల్ ఫోన్స్, లాప్ టాప్‌లకు ఛార్జింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి బాడీలో విపరీతమైన హీట్ ఉంటుంది. ఆ వేస్ట్ హీట్‌ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే అద్భుత మెటీరియల్‌ను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు ఐఐటీ మండి పరిశోధకులు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. పర్యావరణాన్ని కాపాడేందుకు చాలా కంపెనీలు, ఇన్‌స్టిట్యూట్‌లు పని చేస్తాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌టెక్నాలజీ మండి పరిశోధకులు.. హ్యూమన్ బాడీలో ఉండే వేస్ట్ హీట్‌ని ఎలక్ట్రిసిటీగా మార్చే స్పెషల్ మెటీరియల్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.

దీనికి సోలార్ ఎనర్జీ లాగా పెద్ద ఎక్విప్‌మెంట్ అలాగే సూర్యుని వేడి అవసరం లేదు. కేవలం హ్యూమన్ బాడీ హీట్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చని సోని వివరిస్తు్న్నారు. సాధారణంగా ఇండస్ట్రియల్, ఎనర్జీ జనరేషన్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హ్యూమన్ వేస్ట్ హీట్ వాతావరణంలోకి వెళుతోంది. ఈ హీట్‌ని ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయాలనే లక్ష్యంతో పరిశోధన చేస్తున్నారు.

హ్యూమన్ బాడీ హీట్ ఎలక్ట్రిసిటీగా ఎలా మారుతుంది..

హ్యూమన్‌ బాడీ నుంచి హీట్‌ని గ్రహించి ఎలక్ట్రిసిటీగా మార్చగల ఒక ప్రోటోటైప్‌ను సోనీ అభివృద్ధి చేశారు. ఈ టెక్నీలజీ ఆధారంగా ల్యాప్‌టాప్‌లను ల్యాప్‌పై ఉంచి ఛార్జ్ చేయవచ్చు. అదేవిధంగా.. మొబైల్ ఫోన్‌ల వంటి డివైజ్‌లు పట్టుకోవడం లేదా వాటిని జేబులో ఉంచడం ద్వారా ఛార్జ్ చేసే అవకాశాలను కల్పిస్తాయి. ఈ ఆవిష్కరణ.. ఛార్జర్‌లు, సాకెట్లు లేదా స్విచ్‌ల అవసరాన్ని తొలగిస్తుంది. హ్యూమన్‌ బాడీ ద్వారా విడుదలయ్యే హీట్‌ ఈ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి సరిపోతుంది. డివైజ్‌లో ఇంటిగ్రేట్‌ చేసిన స్మాల్‌ మాడ్యూల్‌ బాడీ హీట్‌ని యూజబుల్‌ ఎనర్జీగా మారుస్తుంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లతో పాటు, చేతి గడియారాలు, ఇయర్‌ఫోన్‌లు వంటి ఇతర డివైజ్‌లను కూడా బాడీ హీట్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చని పరిశోధన సూచిస్తుంది.


Next Story