- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం.. యువకుడిని కాపాడిన ఆపిల్ వాచ్
గుండెపోటు వచ్చే ముందే అప్రమత్తం చేసి ఆపిల్ స్మార్ట్ వాచ్ చాలా మంది ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సముద్రంలో నీటి అడుగుబాగానికి వెళ్లిన ఓ టెకీ ప్రాణాలను సైతం ఆపిల్ వాచ్ కాపాడింది. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: గుండెపోటు వచ్చే ముందే అప్రమత్తం చేసి ఆపిల్ స్మార్ట్ వాచ్ చాలా మంది ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సముద్రంలో నీటి అడుగుబాగానికి వెళ్లిన ఓ టెకీ ప్రాణాలను సైతం ఆపిల్ వాచ్ కాపాడింది. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ముంబైకి చెందిన 26 ఏళ్ల క్షితిజ్ జోడాపే అనే డెవలపర్ పుదుచ్చేరిలో తన కోచ్ తో కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్ ట్రిప్ కి వెళ్లాడు. నీటి అడుగుబాగానికి వెళ్లిన తరవాత అతడి వెయిట్ బెల్ట్ ఊడిపోయింది.
దీంతో ఒక్కసారిగా క్షితిజ్ నీటిలో వేగంగా పైకి వెళ్లడం మొదలైంది. ఈ క్రమంలో ఊపిరి అందక ఊపిరితిత్తులు వ్యాకోచించాయి. ఏం చేయాలో అర్థం కాక కిందకు వెళ్లే ప్రయత్నం చేసినా వెళ్లలేకపోయాడు. అయితే ఆక్సీజన్ లెవల్స్ తగ్గడంతో వెంటనే అతడి స్మార్ట్ వాచ్ అలారం మోగింది. అతడికి కొద్దిదూరంలో ఉన్న కోచ్ కు అది వినిపించగా వెంటనే వెళ్లి అతడిని కాపాడాడు. తాను సాఫ్ట్ వేర్ అయినప్పటికీ ఆపిల్ వాచ్ ఇంత ఖచ్చితంగా పనిచేస్తుందని ఊహించలేదన్నాడు. వాచ్ పెట్టుకోవడం వల్లనే ప్రాణాపాయ స్థితి నుండి బయపడ్డానని చెప్పాడు.






