Acer నుంచి పర్యావరణ అనుకూల ల్యాప్‌టాప్‌.. రీసైక్లింగ్ చేసే ఆప్షన్!

by Disha Web Desk 17 |
Acer నుంచి పర్యావరణ అనుకూల ల్యాప్‌టాప్‌.. రీసైక్లింగ్ చేసే ఆప్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసర్ కంపెనీ భారత్‌లో కొత్తగా ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Acer Aspire Vero’. ఇది ఒక ప్రత్యేకమైన ల్యాప్‌టాప్. దీనిలో కొన్ని పార్ట్‌లను తిరిగి రీసైకిల్ చేసేవిధంగా తయారు చేశారు. ఇది పర్యావరణ అనుకూలమైనదిగా కంపెనీ పేర్కొంది.



Acer Aspire Vero ల్యాప్‌టాప్ 14-అంగుళాల పూర్తి HD (1920 x 1080 పిక్సెల్‌లు) IPS స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా 300 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. TFT LCD ప్యానెల్ Acer ComfyView LED-బ్యాక్‌లిట్ డిస్‌ప్లే ఉన్నాయి. 13th Gen ఇంటెల్ కోర్ i5-1335U ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలోనే ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో పాటు ఇంటెల్ కోర్ i3-1315U CPU ప్రాసెసర్ ల్యాప్‌టాప్ కూడా ఉంది.



16GB RAM తో 512GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. Windows 11 ఆధారంగా పనిచేస్తుంది. 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 50 Wh బ్యాటరీని అందించారు. నాయిస్ రిడక్షన్, ఫింగర్ ప్రింట్ రీడర్, 720P HD కెమెరా కూడా ఉంది. ల్యాప్‌టాప్ బరువు 1.5 కిలోలు. i5 ప్రాసెసర్ ధర రూ. 64,999. i3 ధర రూ. 49,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏసర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.


Next Story

Most Viewed