వాట్సాప్‌లో ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే ఫీచర్

by Disha Web Desk 17 |
వాట్సాప్‌లో ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త ఫీచర్‌‌ను తీసుకురావాలని చూస్తోంది. డెస్క్‌టాప్ వెర్షన్ ద్వారా ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను ఇతరలకు సెండ్ చేయడానికి అనుమతించే ఫీచర్‌ను తన వినియోగదారులకు పరిచయం చేయనుంది. గత డిసెంబర్‌ నుంచి వాట్సాప్ డెస్క్‌టాప్ బీటాలో ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి పనిచేస్తుందని సమాచారం. ఇది గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మంచి నాణ్యత, హై క్వాలిటీ(రిజల్యూషన్‌)తో కూడిన ఒరిజినల్ ఫొటోలను ఎలాంటి కంప్రెషన్(క్వాలిటీ తగ్గింపు) లేకుండా అవతలి వారికి పంపవచ్చు.

ఫొటో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా, వాటి అసలు రిజల్యూషన్‌ను కోల్పోతామనే ఆందోళన అవసరం లేకుండా ఫొటోల క్వాలిటీ విషయంలో మరింత నియంత్రణను అందించడానికి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు WABetaInfo నివేదించింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఫొటోలను సెండ్ చేసేటప్పుడు అసలు క్వాలిటీ కంటే తక్కువ నాణ్యతతో ఫొటోలు సెండ్ అవుతున్నాయి. దీని ద్వారా వినియోగదారులు అసంతృప్తికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి : WhatsApp :వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్

Next Story

Most Viewed