WhatsApp ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్‌ ఫీచర్‌లో మరిన్ని కొత్త ఆప్షన్లు!

by Disha Web Desk 17 |
WhatsApp ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్‌ ఫీచర్‌లో మరిన్ని కొత్త ఆప్షన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్తగా మరిన్ని ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే చాలా ఫీచర్స్‌ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్‌లను తీసుకురానుంది. మెసేజ్ డిస్‌అప్పియరింగ్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లు నిర్ణిత సమయం తరువాత ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయి. ఈ టైం పీరియడ్ ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజులుగా ఉంది. అయితే ఈ ఫీచర్లో అదనంగా మరో 15 ఆప్షన్లను వినియోగదారులకు అందించాలని కంపెనీ చూస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, రాబోయే కొత్త ఫీచర్లో ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్ టైం పరిమితిని ఒక గంట నుంచి మొదలుకుని ఏడాది వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.


Next Story

Most Viewed