టీమిండియాలో కరువైన క్రమశిక్షణ: వీవీఎస్

by  |
టీమిండియాలో కరువైన క్రమశిక్షణ: వీవీఎస్
X

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కోల్పోవడంపై వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. భారత బౌలర్లు తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో కోలుకున్నారనీ, కానీ, బ్యాట్స్‌మెన్‌లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారని అన్నాడు. దీనికి కారణం బ్యాట్స్‌మెన్‌లలో క్రమశిక్షణ కొరవడటమేనని వ్యాఖ్యానించారు. పరుగుల యంత్రంగా పిలవబడే కెప్టెన్ కోహ్లీ.. సిరీస్ మొత్తంలో కేవలం 38 పరుగులే చేయడంపై వీవీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొహ్లీ వైఫల్యమే భారత జట్టు వన్డే, టెస్ట్ సిరీస్‌లు కోల్పోవడానికి కారణమని తెలిపాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ బుమ్రా వైఫల్యం కూడా ఓటమికి మరోకారణంగా చెప్పుకొచ్చాడు. భారత జట్టు ఇప్పటికైనా లోపాలను సరిదిద్దుకోవాలనీ, లేదంటే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకోవడం కష్టమేనని హెచ్చరించాడు. ఈ సందర్భంగా సిరీస్ విజేత న్యూజీలాండ్ జట్టుకు వీవీఎస్ అభినందనలు తెలిపాడు.

tags: team India, discipline, New Zealand, VVS Laxman, kohli, bumrah, test match, one day match, ODI, series, India,



Next Story