కేసీఆర్ ప్రకటనపై టీచర్స్ యూనియన్ హర్షం

by  |
కేసీఆర్ ప్రకటనపై టీచర్స్ యూనియన్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రావడంతో.. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు ఉద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ టీచర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.

30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు టీచర్స్ యూనియన్ ప్రకటించింది. రిటైర్‌మెంట్ వయస్సు పెంచడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి నిర్ణయాలను స్వాగితిస్తు్న్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed