మున్సిపల్ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో విడుదల

152

దిశ,వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం ఉదయం టీడీపీ నేత నారా లోకేష్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాలతో కూడిన పురపాలక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం అందించనున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. పాత పన్నుల మాఫీ, చెల్లించాల్సిన బకాయిలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. చెత్తలేని నగరాల కోసం సుందరీకరణ మిషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల కోసం టాయిలెట్లు, తాగునీటి సౌకర్యంతో ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాల పంపిణీతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంచనున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..