'డీజీపీ పంపిన నోటీసులు చిత్తు కాగితంతో సమానం'

by  |
TDP-Adhikara-Prathinidhi-1
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్, హెరాయిన్, గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతుంటే వాటిని ఆపేందుకు ప్రయత్నం చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలకు డీజీపీ నోటీసులు ఇవ్వడమేంటని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కు రాష్ట్రానికి సంబంధం ఉందని వెల్లడించిన జాతీయ మీడియాకు నోటీసులిచ్చే ధైర్యం డీజీపీకి ఉందా అని నిలదీశారు. డీజీపీ పంపిన నోటీసులు చిత్తు కాగితంతో సమానమని పట్టాభి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై, పోలీసుల వైఫల్యాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాలపై పోలీస్ శాఖ ఎంతవరకు విచారణ చేశారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ గుట్టును బయటపెట్టిన టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం కాదని..చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలను విచారించాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు పట్టాభి సవాల్ విసిరారు.



Next Story