జగన్ ముద్దులు పోయాయి.. గుద్దులే మిగిలాయి: చంద్రబాబు

99

దిశ, వెబ్‎డెస్క్ : తిరుపతి ఉపఎన్నిక మరింత వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. తిరుపతిలో టీడీపీ తరుఫున ప్రచారం కోసం రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు జగన్, వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా రౌడీలా.. రౌడీలైనా పరిగెత్తిస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీఎం పదవి నాకు కొత్తేమీకాదని, ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి గెలిస్తే మాకు ఏమో లబ్ది పొందుతుందని రాలేదన్నారు. తిరుపతిలో టీడీపీ గెలుపుతో వైసీపీ నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన ముద్దులు పోయాయని.. ఇప్పుడు ప్రజలకు గుద్దులు మాత్రమే మిగిలాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..